నేటి సత్యం మే 20
ప్రైవేటీకరణ వైపు తెలంగాణ విద్యుత్ రంగం?
ఏపీలోని గ్రీన్కో అనే ప్రైవేట్ పీఎస్‌పీ(పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్) నుండి 5 ఏళ్ల పాటు 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైన తెలంగాణ జెన్కో
2వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం టెండర్లు పిలవగా, గ్రీన్కో సంస్థ ఒక్కటే 500 మెగావాట్ల విక్రయానికి ముందుకు రావడంతో ఆమోదం తెలిపిన జెన్కో సంస్థ
విద్యుత్ కొనుగోలు ఒప్పందం పూర్తయిన ఆరు నెలల నుండి విద్యుత్ సరఫరా చేయాలని జెన్కో నిబంధన
డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో, అంటే ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల మధ్య 6 గంటల పాటు పీఎస్‌పీ నుండి విద్యుత్ సరఫరా చేయాలని గ్రీన్కో సంస్థకు జెన్కో మరో నిబంధన
ఇప్పటివరకు తెలంగాణ డిస్కంల సంస్థ ఐఈఎక్స్(భారత ఇంధన ఎక్స్చేంజ్) నుండి ఈ విద్యుత్ కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు ప్రైవేట్ పీఎస్‌పీ నుండి జెన్కో విద్యుత్ కొనుగోలు చేయడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
మరోవైపు ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పంద ప్రక్రియను టీఆర్‌సీ(విద్యుత్ నియంత్రణ మండలి)కి పంపి ఆమోదం పొందే పనిలో పడిన జెన్కో సంస్థ
ఒక మెగావాట్ పీఎస్‌పీ విద్యుత్‌కు రూ.1.23 కోట్ల చొప్పున ఏడాదికి రూ.615 కోట్లు, అంటే ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.6.70 కు కొనుగోలు చేసేందుకు జెన్కో సిద్ధమైందని, ఇది మార్కెట్లో సాధారణ విద్యుత్ కంటే ఎక్కువగా ఉందని విమర్శలు
సాధారణంగా విద్యుత్ కొనుగోలుకు డిస్కంల సంస్థలు ఒప్పందం చేసుకుంటాయని కానీ ఇక్కడ జెన్కో కొనుగోలు చేసి డిస్కంలకు ఇవ్వడం చర్చనీయాంశమని అభిప్రాయపడుతున్న నిపుణులు
జెన్కో విద్యుత్ కొనుగోలు చేసి, డిస్కంలకు సరఫరా చేసి, ఒక్కో యూనిట్‌కు రూ.7 కమిషన్ తీసుకుంటుందని, ఈ భారమంతా విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలే భరించాల్సి ఉంటుందని నిపుణుల అంచనా
తెలంగాణలో నాగార్జున సాగర్, శ్రీశైలం, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి ప్రాంతంలో పీఎస్‌పీ నిర్మాణానికి అవకాశం ఉన్నా కూడా, వాటికి ప్రతిపాదనలు పెట్టకుండా ఏకంగా ఏడేళ్ల పాటు ప్రైవేట్ సంస్థ నుండి విద్యుత్ కొనుగోలు చేసేందుకు సిద్ధం అవ్వడం గమనార్హం