Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogనల్గొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి కార్మికులకు వీడిన హిస్టరీ

నల్గొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి కార్మికులకు వీడిన హిస్టరీ

నల్లగొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి కేసులో వీడిన మిస్టరీ

హత్యకు గురైన హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి సుపారీ గ్యాంగ్ చేత హత్య చేయించినట్లు నిర్ధారణ

నల్లగొండ జిల్లా కేంద్రం సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీన (40), కుమారుడు ముజమిల్(20), కుమార్తె అక్సర (11) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీ షీటర్ల చేత హత్య చేయించిన అల్లుడు, కూతురు

హసీనాకు గతంలో రెండు పెళ్లిళ్లు జరగగా.. నల్లగొండకు చెందిన మహ్మద్ సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకున్న హసీన

సుల్తాన్‌కు కూడా గతంలో రెండు పెళ్లిళ్లు జరగగా.. సుల్తాన్ మొదటి భార్య పిల్లలు మహ్మద్ ముజమిల్, అప్సరతో కలిసి నల్లగొండలో జీవిస్తున్న హసీన

హసీన పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇల్లులు ఉండడంతో.. ఆ ఆస్తిని తమకు ఇవ్వకుండా తన మూడో భర్త అయిన సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని, హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు నిర్ధారించిన పోలీసులు

పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. సుల్తాన్ మృతదేహం పై 6 చోట్ల కత్తి గాయాలు ఉండగా, హసీనాకు 7 చోట్ల, కుమార్తె అక్సరకు 9 చోట్ల, ముజమిల్‌కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తింపు

హంతకులకు భయపడి 11 ఏళ్ల అక్సర మంచం కింద దాక్కుంటే ఆమెను బయటకు లాగి చంపి ఉంటారని.. ఆమె మృతదేహం సగం మంచం కింద ఉండటాన్నిబట్టి అనుమానిస్తున్న పోలీసులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments