Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకూ

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకూ

నేటి సత్యం కామారెడ్డి ఆగస్టు 3

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

అన్ని శాఖల సమన్వయంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు

సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశంలో నిర్వహించారు

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ స్పూర్తిని ప్రతిబింబించేలా, పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ఆగస్టు 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు.

వేదిక, అతిథుల సీటింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా సమగ్ర జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని జిల్లా ప్రణాళికాధికారి కి కలెక్టర్ ఆదేశించారు. ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.

జాతీయ భావనను పెంపొందించేలా విద్యార్థులతో దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ,

సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రశంసా పత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల వివరాలతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అడిషనల్ అదనపు స్థానిక కలెక్టర్ NY గిరి. ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ. డి ఆర్ వో పాండు , జెడ్పి సీఈఓ చందర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments