నేటి సత్యం / ఎల్లారెడ్డి నియోజకవర్గం /సెప్టెంబర్ 4
బి ఆర్ ఎస్ వంటా వార్పు కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండల కేంద్రం లో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వంటవార్పు కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో టెంట్ పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది
ప్రజలు కూర్చోడానికి కనీసం టెంట్ వెయ్యకుండా అడ్డుకుంటారా అంటూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ పోలీసులతో వాగ్వివాదం చేశారు
ధర్నా కోసం టెంట్ కూడా పర్మిషన్ ఇవ్వనందుకు నిరసన గా లింగంపేట్ మండలం కేంద్రం లో అంబేద్కర్ చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం ఎదురుగా కూర్చొని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నిరసన తెలిపారు