Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogవిద్యార్థి దశ నుండి కార్మిక నాయకునిగా ...

విద్యార్థి దశ నుండి కార్మిక నాయకునిగా …

నేటి సత్యం/ హైదరాబాద్ సెప్టెంబర్ 9

ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొట్టే నర్సింహ్మ

విద్యార్థి సంఘం నుoచ్చి అతి చిన్న వయసులోనే అత్యున్నత పదవికి

సెప్టెంబర్ 6 7 8 తేదీలలో కరీంనగర్లో జరిగిన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలో మూడవరోజు నూతన నాయకత్వం ఎన్నికలో ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యూనియన్ చరిత్రలో చిన్న వయసులో అత్యున్నత పదవికి ఎన్నిక కావడం జరిగింది.
1977 ఏప్రిల్ 14న నాగర్ కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, నక్కలపల్లి గ్రామంలో నరసమ్మ, కిష్టయ్య దంపతులకు 5వ సంతానంగా జన్మించిన నరసింహ ఇంటర్ వరకు నాగర్ కర్నూల్ లో చదివి అనంతరం లా చదవడానికి హైదరాబాదు వచ్చి పడాల రామారెడ్డి లా కాలేజీలో విద్యనభ్యసిస్తూ హైదరాబాద్ పట్టణంలో ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా వారు ఎదిగారు. ఏఐఎస్ఎఫ్ లో దిల్సుఖ్నగర్ ఏరియా కార్యదర్శిగా ప్రారంభమై హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా చేసిన వారు అనంతరం సికింద్రాబాద్ ఏరియా సిపిఐ పార్టీ కార్యదర్శి గా, హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా పనిచేయడం జరిగింది. అనంతరం ట్రేడ్ యూనియన్ నిర్మాణంలోకి వచ్చిన వారు బోయిన్పల్లి మార్కెట్ హమాలి యూనియన్ ఏర్పాటు చేసి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలు హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించిన వారు 2022 యాదాద్రి భువనగిరిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏఐటియుసి మూడవ మహాసభలో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై నారు.
గత నాలుగు సంవత్సరాలుగా విస్తరులకు ఎంతగానో ప్రయత్నించి అనేక నూతన యూనియన్లను ఏర్పాటు చేయటం జరిగింది. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న టువంటి అనేక సమస్యలపై ఎన్నో పోరాటాలు నిర్వహించిన వారు నేడు కరీంనగర్ పట్టణంలో జరిగిన నాలుగో మహాసభలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావటం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments