బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం
24 గంటల లోపే కేసును చేదించిన పోలీసులు
నిజామాబాద్ సెప్టెంబర్ 6 నేటి సత్యం ప్రతినిధి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి లో శనివారం కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాన్ష్ (వేదాంషు) కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే విజయవంతంగా ఛేదించారు. నిందితులను గుర్తించి బాలుడిని సురక్షితంగా రక్షించారు. బాల్కొండ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన నరేష్, సంధ్య దంపతుల మూడో కాన్పు కోసం నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రికి వచ్చారు. వారి ఇద్దరు కుమారులు ఆవరణలో ఆడుకుంటుండగా, ఒక గుర్తుతెలియని మహిళ చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి చిన్న కుమారుడైన వేదాన్ష్‌ను ఎత్తుకెళ్లిపోయింది. బాలుడి తమ్ముడిని ఎవరో తీసుకెళ్లారని పెద్ద కుమారుడు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ పోలీసులు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా మహిళ బాలుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.కిడ్నాప్ ఉదంతం తెలియగానే నిజామాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఆధారాల సహాయంతో పోలీసులు కిడ్నాపర్‌ను పట్టుకుని, బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.ఈ కిడ్నాప్ వెనుక ఉన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ లో నిందితులు దొరికినట్లు సమాచారం