నేటి సత్యం/ కామారెడ్డి/ అక్టోబర్ 16
హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన దళిత నాయకులు బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి కల్పిత నాయకుడు అంటూ పుస్తకం రాస్తున్న హమారా ప్రసాద్ కు వ్యతిరేకంగా డివిజన్లోని అంబేద్కర్ సంఘం దళిత నాయకుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ పుస్తకం రాయడం అంతేకాకుండా ప్రపంచానికే దిశా నిర్దేశం చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి అయినా అంబేద్కర్ ను విమర్శించడం కరెక్టు కాదని అన్నారు వెంటనే అమారా ప్రసాద్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు హమారా ప్రసాద్ అంబేద్కర్ పై రాస్తున్న పుస్తకాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బంగారు సాయిలు, బంగారు మైసయ్య, దేశాయి పేట్ ప్రశాంత్, కౌన్సిలర్ వెంకట్, విజయ్ కుమార్, మల్లూరు సాయిలు,ఆంజనేయులు, వినోద్,పరశురామ్, మన్నే సాయిలు, భూషణ్, బరేంగేడిగి గంగారం సిపిఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు