Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలు ముగింపు..

నేటి సత్యం / హనుమకొండ/ సెప్టెంబర్ 29

హనుమకొండలో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలు

పోరాటాల ఖిల్లా హనుమకొండ జిల్లాలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ( ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారితో కలిసి ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ జాయింట్ రిజిస్ట్రార్ పాల్గొన్నారు.

విద్యార్థుల విద్యా హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ చారిత్రాత్మకంగా నిర్వహించిన ఉద్యమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

విద్యార్థి ఉద్యమం నుంచి ప్రారంభమైన నాయకత్వ ప్రయాణం, అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిపాలనా బాధ్యతలు నిర్వహించిన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. విద్యార్థి ఉద్యమాలు సమాజంలో ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.

ఏఐఎస్ఎఫ్ 90 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం కోసం సాగిన పోరాటాలకు ప్రతీకగా నిలిచిందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments