Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

జన గణన లో కుల గణన చేపట్టాలి

నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 12
*కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కులగణన చేపట్టాలి !*

*విశ్రాంత ఐఏఎస్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు డిమాండ్*


కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ సామాజిక వర్గాల జనాభా, వారి సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి రావాలంటే కులగణన అవసరమని పేర్కొన్నారు.
సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయాబ్ హాల్‌లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన “రౌండ్ టేబుల్” సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశానికి బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ, దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే వివిధ కులాల జనాభా ఎంత ఉంది, ఆయా వర్గాలు విద్య, ఉద్యోగాలు, ఉపాధి, ఆర్థిక వనరులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో ఏ స్థితిలో ఉన్నాయో తెలియజేసే విశ్వసనీయమైన గణాంకాలు అవసరమని అన్నారు. కులగణన ద్వారా లభించే సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అవసరమైన విధానాలను రూపొందించవచ్చని పేర్కొన్నారు.
కులగణన కేవలం జనాభా లెక్కింపు మాత్రమే కాదు.. సామాజిక అసమానతలను గుర్తించి, వాటిని తొలగించేందుకు అవసరమైన విధాన రూపకల్పనకు కీలకమైన సాధనం అని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర సామాజిక వర్గాల అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు వాస్తవ గణాంకాల ఆధారంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కులాలవారీగా జనాభా వివరాలను శాస్త్రీయంగా సేకరించాలని కోరారు.
సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడానికి, అభివృద్ధి ఫలాలు సమానంగా అందించడానికి, రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయ లక్ష్యాలను సాధించడానికి కులగణన దోహదపడుతుందని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని చిరంజీవులు డిమాండ్ చేశారు.
*అక్టోబర్ 22 నుండి 31వరకు జిల్లాలలో కార్యక్రమాలు*

*బి ఎల్ ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్య ప్రకాష్*

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో కామారెడ్డి బి సీ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 22 నుంచి 31 వరకు కార్యక్రమాలు బి ఎల్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించినట్లు నల్లా సూర్య ప్రకాష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి, వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
రాయండి పాండురంగ చారి, సీపీఐ (అంబేడ్కర్–మార్క్సిస్టు) కన్వీనర్ సుంకె రవి, బిఎల్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్ది రాములు, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ వనం సుధాకర్,బహుజన రచయిత కాలువ మల్లయ్య, బహుజన గాయకులు మాస్టర్ జీ, నారగోని, కుంభం సుకన్య,వి.తుకారం నాయక్,రాగసుధ, కె.మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments