నేటి సత్యం/ కొండాపూర్/ అక్టోబర్ 13 
సీ.ఆర్. ఫౌండేషన్‌కు రూ. 40 లక్షల విలువైన ఫ్లాట్ బహూకరణ
శ్రీమతి పల్లెకొండ నారాయణమ్మ గారికి సీ.ఆర్. ఫౌండేషన్ కృతజ్ఞతలు
హైదరాబాద్‌లోని పటాన్‌చెరు ప్రాంతం, ఇంద్రేశం కాలనీలో ఉన్న 1,045 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను, సుమారు రూ. 40 లక్షల విలువైన ఈ ఆస్తిని, శ్రీమతి పల్లెకొండ నారాయణమ్మ గారు చండ్ర రాజేశ్వరరావు (సీ.ఆర్.) ఫౌండేషన్‌కు బహూకరించారు.
ఈ రోజు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కంది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, సంబంధిత పత్రాలను సీ.ఆర్. ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు కె. నారాయణ గారికి, కోశాధికారి చెన్నకేశవు గారికి అందజేశారు.
సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారంగా విలువైన ఆస్తిని ఫౌండేషన్‌కు బహూకరించిన శ్రీమతి పల్లెకొండ నారాయణమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు సీ.ఆర్. ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇలాంటి దాతృత్వం సమాజ సేవకు మరింత తోడ్పడుతుందని ఆశిస్తున్నాము.
కె. నారాయణ
గౌరవాధ్యక్షులు, సీ.ఆర్. ఫౌండేషన్