Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

విచ్చలవిడిగా బెల్ట్ షాపులు..

నేటి సత్యం/ కామారెడ్డి ప్రతినిధి/ అక్టోబర్ 16

కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. నియంత్రణ ఏది?

గుడి, బడి, జాతీయ రహదారుల పక్కనే మద్యం విక్రయాలు.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు?

దేశాయిపేటలో మద్య నిషేధ తీర్మానం చేసినా.. బస్టాండ్ వద్ద కొత్తగా బెల్ట్ షాప్ ఏర్పాటు

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ విచ్చలవిడిగా సాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వైన్ షాపుల నిర్వాహకులు తమ మద్యం విక్రయాలను పెంచుకునేందుకు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గుడి, బడి అనే తేడా లేకుండా, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు జాతీయ రహదారుల వెంట కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో మద్యం సేవించిన కొందరు రోడ్లు దాటే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మద్యం విక్రయాలపై నియంత్రణ లేకపోతే రహదారి భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

మరోవైపు కొన్ని బెల్ట్ షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, ఇతర మద్యం ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై ఎక్సైజ్ అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

దేశాయిపేటలో తీర్మానం చేసినా.. బస్టాండ్ వద్ద బెల్ట్ షాప్ ఎలా?

జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో మద్య నిషేధం అమలు చేయాలని గ్రామస్తులు గతంలో తీర్మానం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ గ్రామ బస్టాండ్ వద్ద గత కొన్ని రోజుల క్రితం కొత్తగా బెల్ట్ షాప్ ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల తీర్మానానికి విలువ లేదా? బస్టాండ్ సమీపంలో మద్యం విక్రయాలకు అనుమతి ఎలా లభించింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

జిల్లా ఎక్సైజ్ అధికారులు స్పందించి దేశాయిపేటతో పాటు జిల్లావ్యాప్తంగా బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయో లేదో విచారించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ విక్రయాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, బెల్ట్ షాపుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments