Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

ఓటు దొంగతనం. రాజ్యాంగాన్ని అవమానపరచడమే.

నేటి సత్యం/ హైదరాబాద్/ అక్టోబర్ 17

జ్ఞానేష్ కుమార్ ను అరెస్టు చేయాలి ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్

‘ఓటు దొంగతనం’ రాజ్యాంగాన్ని అవమానించడమే

ఎస్ఐఆర్ ను వెంటనే రద్దు చేయాలి

సిఈసి జ్ఞానేష్ కుమార్‌ ను అభిశంసించే వరకు పోరాటం ఆగదు

– ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతల హెచ్చరిక

లోక్ భవన్ ముట్టడి, తోపులాటలు, అరెస్టులు

 

ప్రధాని మోదీ తన మురికి రాజకీయాలకోసం సిఈసి జ్ఞానేష్ కుమార్‌ తోకలసి ఓట్ల దొంగతనానికి పాల్పడ్డాడని, ప్రజాస్వామ్య దేశంలో ‘ఓటు దొంగతనం’ రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మర్రి శ్రీమాన్, నేర్లేకంటి శ్రీకాంత్ లు ఆగ్రహం వ్యక్తం చేసారు. మన ఓటింగ్ వ్యవస్థకు జరిగిన నష్టానికి, గందరగోళానికి కారణమైన సిఈసి జ్ఞానేష్ కుమార్‌ ను అభిశంసించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఎస్ఐఆర్ ను రద్దు చేసి, సిఈసి జ్ఞానేష్ కుమార్‌ తక్షణమే అభిశంసించలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సంయుక్తాధ్వర్యంలో బుధవారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ శ్రేణులు జండాలు, ప్లకార్డులు చేతబూని ఎస్ఐఆర్ ను రద్దు చేయాలనీ, ఓట్ చోర్ గద్ది చోడ్, మందిర్ చోర్ ఓట్ చోర్ అబ్ క్యా బాకీ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినాదాలు చేస్తూ హైదరాబాద్, సోమాజిగూడ, లోక్ భవన్ వద్ద బారికేడ్ లను ఛేదించుకొని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ సందర్బంగా పోలీసులు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ శ్రేణుల మధ్య తోపులాటలు జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈ సందర్బంగా పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలో జరిగిన ఓట్ల దొంగతనంలో ఓట్ల దొంగ “జ్ఞానీ”, కుట్రదారులు “మొదిషా” అని ఆరోపించారు. మొదట ఓట్ల దొంగతనం తరువాత ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమే వీరి ఆకాంక్ష అని అన్నారు. బీజేపీ పన్నిన కుట్ర ద్వారానే ఓట్ల దోపిడీ జరిగిందని, దీనికి కారణమైన “జ్ఞానీ చోర్” ను అభిశంసించలేని, ప్రధాని మోదీ తప్పుకోవాలని డిమాండ్ చేసారు. మర్రి శ్రీమాన్ మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగ విలువలను తుంగలోతొక్కడానికే ప్రధాని మోదీ ఎన్నికల పారదర్శకత మరియు స్వయంప్రతిపత్తి దెబ్బతిస్తున్నాడని మండిపడ్డారు. భారీ నిరుద్యోగం, రైతులు మరియు కార్మికుల దయనీయ పరిస్థితులు ఏవి పట్టించుకోకుండా ప్రధాని మోదీ తన ఫాసిస్ట్, నిరంకుశ విధానాలతో ప్రశ్నించే గొంతుకలు అణివేస్తున్నాడని అన్నారు. ఇందుకు ఉదాహరణ ఢిల్లీలో ఎస్ఐఆర్ కు వ్యతరేకంగా జరుగుతున్న విద్యార్ధి, యువజన ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడమే అని, మోడీ ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్ధి, యువజనులుగా బలమైన పోరాటాలు నిర్మించి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని చెప్పారు. నేర్లేకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలో కొనసాగడం కోసం ఓట్ చోరీ వంటి అనైతిక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ద్వంసం చేసే ఫాసిస్టు శక్తులను అడ్డుకుంటూనే ఉంటామని, ఎస్ఐఆర్ ను వెంటనే రద్దు చేసి, సిఈసి జ్ఞానేష్ కుమార్‌ ను అభిశంసించే వరకు పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు వంశీ వర్ధన్ రెడ్డి, లెనిన్, ముదిగొండ మురళి కృష్ణ, నెల్లి సత్య, బలుముల ప్రేమ్ కుమార్ , ఎఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు షేక్ మహమూద్, K. కళ్యాణ్, భగతసింగ్, మహేష్, మధుకర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చైతన్య యాదవ్, ఎండీ అన్వర్, అనిల్, హరీష్, జోసెఫ్ భాను, అరుణ్, ఆకాష్, కృష్ణ, వెంకటేష్, రఘు, రామ్ చరణ్, చిరంజీవి, ప్రభాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments