Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

గంగమ్మకు.. చేయూతనివ్వండి.

గంగమ్మ కన్నీళ్లు తుడిచేదెవరు?
కాలిపోయిన గూడులోనే… కూలే ఇంట్లోనే… ఒంటరి పోరాటం

_భర్త అనారోగ్యం – ఎదిగిన కూతురు – 40 ఏళ్ల శిథిలావస్థ లోఇల్లు అగ్నికి ఆహుతి – మేక కాళ్లు కాల్చి బతుకు బండి – ఆదుకోవాలని వేడుకోలు_
నిజామాబాద్ అక్టోబర్ 22 నేటి సత్యం ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ ప్రాంతం, కసాబ్ గల్లీలో ఓ హృదయ విదారక గాథ వెలుగు చూసింది. కసాబ్ గల్లీకి చెందిన గంగమ్మ, సైలాన్ దంపతులు దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు.
వీరు నివాసం ఉంటున్న ఇల్లు సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పెంకుటిల్లు. ప్రస్తుతం ఏ క్షణంలోనైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. గోడలు శిథిలమై, పైకప్పు పూర్తిగా దెబ్బతింది. ఇటీవల అగ్నిప్రమాదం జరిగి ఇల్లు కాలిపోయింది అయినా అందులోనే జీవనం
అన్నీ తానై గంగమ్మ…
ఈ దంపతులకు ఎదిగిన కూతురు ఉంది. భర్త సైలాన్ ఆరోగ్యం అంతంత మాత్రమే కావడంతో ఏ పనీ చేయలేని పరిస్థితి. దీంతో కుటుంబ భారం మొత్తం గంగమ్మపైనే పడింది. మేక కాళ్లు, తలకాయలు కాల్చి అమ్మడం ద్వారా వచ్చే స్వల్ప ఆదాయంతో కుటుంబాన్ని నడుపుతోంది.
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన గూడు…
ఇటీవల వీరి నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఉన్న ఆ చిన్న గూడు కూడా పూర్తిగా కాలిపోయింది. అయినప్పటికీ వేరే గత్యంతరం లేక అదే కాలిపోయిన, కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లోనే ఈ కుటుంబం దయనీయంగా నివసిస్తోంది.
ఎదిగిన కూతురును పెట్టుకుని ఆ కాలిపోయిన ఇంట్లో ఉండలేక… బయటకు వెళ్లలేక గంగమ్మ దంపతులు నిత్యం కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు.
ఆదుకోవాలని వేడుకోలు…
తమకు ప్రభుత్వం నుండి ఇల్లు మంజూరు చేయాలని, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని గంగమ్మ కుటుంబం వేడుకుంటోంది. మనసున్న మారాజులు, దాతలు స్పందించి గంగమ్మ కన్నీళ్లు తుడవాలని స్థానికులు కోరుతున్నారు.
సహాయం కోసం సంప్రదించండి:(+91 92926 00194) అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించాలని పలువురు కాలనీవాసులు కోరుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments