తెలంగాణలో ఉన్నదంతా నాకిండ్రు…
నిజం చెప్తే మహా న్యూస్ కార్యాలయం దాడి చేయిస్తావా…!
ఇప్పటినుండి వాస్తవాలను బట్టబయలు చేసే జర్నలిస్టుల మేమే..
రంగారెడ్డి జూన్ 29 నేటి సత్యం న్యూస్ ప్రతినిధి:
తెలంగాణలో టిఆర్ఎస్ పాలనలో 33 జిల్లాలలో స్థలాలను కబ్జాలకు గురిచేసి ఫామ్ హౌస్ లు నిర్మించుకొని అక్రమించుకున్న వాస్తవాలను మహా న్యూస్ ఛానల్ బట్టబయలు చేస్తే మా ఇజ్జత్ పోయిందని మాజీ మంత్రి కేటీఆర్ మహా న్యూస్ కార్యాలయం పై దాడి చేయడమే కాకుండా వాళ్ల వాహనాలను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్న తలెత్తింది, జర్నలిస్టులకు రక్షణ లేని ప్రభుత్వాలు రాజ్యమేలుతుంటే అవినీతిని ఎలా బయటపెట్టాలని జర్నలిస్టులు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు, ఇంత జరిగిన ఇప్పటివరకు ఊరుకున్నాము కానీ ఇప్పటినుండి ప్రతి ఒక్కటి విడవకుండా మీ వాస్తవాలను బట్టబయలు చేసి కేసులు నమోదు చేయిస్తామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు, కెసిఆర్ కుటుంబం ఇలాంటి పనులు చేయించడంలో ఆరితేరిపోయారని ప్రజలు ఆరోపిస్తున్నట్లు సమాచారం, సమాజంలో ఇలాంటి రాజకీయ నాయకులు ఎప్పుడూ కనబడలేదని, గత 75 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాలను పాలించిన సమయంలో కూడా ఇలాంటి దాడులు జరగలేదని యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని, జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేటీఆర్ ను జర్నలిస్టులు ఎలా దెబ్బ తీస్తారో ఈ ఎన్నికల్లోనే జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు, మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో పనిచేసే విలేకరులను తిట్టినా బూతు మాటలు మాట్లాడిన కొట్టడానికి వచ్చిన ఐదేళ్ల జైలు శిక్ష 50వేల జరిమానా కోర్టులో అప్పటికే తీర్పు ఇచ్చింది తెలియదా కేటీఆర్ కు ఆంబోతు లాగా టీవీ ఛానల్ లపై దూసుకు రావడం సిగ్గుచేటుగా ఉందని ప్రజలు వాపోతున్నారు, ఇలాంటి పనులు ఏ పార్టీ చేసినా ప్రజలు చేసిన ఊరుకునే ప్రసక్తి లేదని తిన్నది కక్కే వరకు వాస్తవాలు రూపకంగా బట్టబయలు చేస్తామని జర్నలిస్టులు భావిస్తున్నట్లు సమాచారం. మహా న్యూస్ ఛానల్ కు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్య తీసుకొని కేటీఆర్ పై కేసులు నమోదు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని 33 జిల్లాల జర్నలిస్టులో కోరుతున్నారు