Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogత్వరలోనే రోడ్డు నిర్మిస్తాం శ్రీనివాస్ యాదవ్

త్వరలోనే రోడ్డు నిర్మిస్తాం శ్రీనివాస్ యాదవ్

సిపిఐ కార్యాలయానికి వెళ్లే రోడ్డును పరిశీలించిన ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్

త్వరలోనే రోడ్డును నిర్మాణం చేపడతామని హామీ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సిపిఐ కార్యాలయానికి వెళ్లే రహదారి దయనీయ స్థితిలో ఉండటంతో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రీనివాస్ యాదవ్ స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా రహదారి పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి ఎన్నో రోజులుగా దెబ్బతిన్నప్పటికీ, సమస్యను గుర్తించి పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన రహదారిని త్వరగా పూర్తి చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో టి రామకృష్ణ వెంకటస్వామి కాసిం కొండల్ సుధాకర్ వెంకటేష్ రామస్వామి సిపిఐ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments