నేటి సత్యం *శేరిలింగంపల్లి: ఆగస్టు
08
*ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం సుజాత నాగేందర్ యాదవ్ గారు నల్లగండ్ల లోని వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ విల్లాస్ లోని వారి స్వగృహంలో రాగం వారి కుటుంబ సమేతంగా “శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని” విశేషమైన పుష్పలంకరణతో, పండిత శ్రేష్ఠులతో సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.*
*శ్రీ వరలక్ష్మి వ్రత వేడుకలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.*
*ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన అన్న ప్రసాదాలను స్వీకరించి శ్రీ వరలక్ష్మీ మాత కృపకు పాత్రులయ్యారు.*
*ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ప్రజలందరిపై శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షీస్తూ ప్రజలందరికీ శ్రీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలిపారు.*
*ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు, సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్ గారు, చందానగర్ సీఐ విజయ్ గారు, ఆనంద్ గారు, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు రామ్ మోహన్ రెడ్డి, కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కృష్ణ రెడ్డి, రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, శ్రీనివాస్, బస్వరాజ్, రాగం వారి కుటుంబ సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.*