ఖమ్మం లో మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడి హత్య యత్నం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి
-కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
-ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
స్. ఛాయదేవి డిమాండ్
: ఖమ్మంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి భవనం పై నుంచి క్రిందకు నెట్టి హత్య చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎన్ఎఫ్ఎడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు S ఛాయదేవి, సహాయ కార్యదర్శి Md ఫైమీద, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని డిమాండ్ చేశారు ఈ రోజు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ మైనర్ బాలికపై దాడి చేసిన నిందితుడిని ఫాస్టట్రాక్ కోర్ట్ ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.