గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో —టిఫిన్ బైఠక్’రేపటి స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
-బీజేపీ —మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ పిలుపు
గన్నేరువరం, జూన్ 12: {నేటి సత్యం};కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు, భారతీయ జనతా పార్టీ గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హైస్కూల్ గ్రౌండ్‌లో ‘టిఫిన్ బైఠక్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ నాయకత్వం వహించి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా తిప్పర్తి నికేష్ మాట్లాడుతూ, రేపు (13-06-2026) మండలంలో నిర్వహించనున్న ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరారు. విద్యార్థులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణాన్ని అందించడం సమాజం యొక్క ప్రాథమిక బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.స్థానిక ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ, పాఠశాలల అభివృద్ధి కోసం అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే భావితరాలకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ హరికాంతపు అనిల్, మచ్చ బాల్రాజ్, మండల ప్రధాన కార్యదర్శులు పుల్లల రాము, బొమ్మడి సురేందర్ రెడ్డి, కార్యదర్శి బూట్ల సంపత్ పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు జాలి శ్రీనివాసరెడ్డి, నందికొండ సురేందర్ రెడ్డి, మునిగంటి లింగయ్య మరియు పార్టీ కార్యకర్తలు గట్టు కిషన్, బోగిని వేణు, చింతల శ్రీనివాస్, బోయిని మధు తదితరులు పాల్గొన్నారు.