Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogనవీన్ అన్న గెలుపు ఖాయం

నవీన్ అన్న గెలుపు ఖాయం

నవీన్ గెలుపును మన గెలుపుగా మార్చుకోవాలి .. దాసు సురేశ్
వ్యవస్థాపక అధ్యక్షులు , బీసీ రాజ్యాధికార సమితి

నేటి సత్యం జూబ్లీహిల్స్ నవంబర్ 9

నవీన్ రూపంలో బీసీలు ఆసెంబ్లీ లో తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలి .. మంత్రి సీతక్క

సామాజిక న్యాయసాధన కోసం నవీన్ గెలుపు అనివార్యం – ఎంపీ మల్లు రవి

బిసి రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ కు మద్దతుగా బీసీలతో భారీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పంచాయతీ రాజ్ శాఖా మాత్యులు సీతక్క , నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు..

సమావేశాన్ని ఉద్దేశించి దాసు సురేష్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలుపు బీసీల గెలుపు అని అన్నారు. ప్రతి ఒక్క బీసీ కూడా నవీన్ యాదవ్ కు ఓటు వేసి తమ ఉనికిని చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్ని రకాలుగా అండగా ఉంటూ జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇచ్చిందని బీసీలు తమ అమూల్యమైన ఓటును వేసి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకొని అవకాశాన్ని సద్విగ పరుచుకోవాలని కోరారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం బీసీల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న విధానాన్ని అదేవిధంగా, బీసీలకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా అని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, యుగంధర్ యాదవ్,మడత కిషోర్, అశోక్, వంగ రవి,శ్రీనివాస్, పోషాల సరస్వతి, గుండేడి ఐలయ్య యాదవ్,గుండు దయానంద్, టి హనుమంత యాదవ్, సిహెచ్ వెంకన్న, రమేష్ బొల్ల,జగన్ యాదవ్ శారద,లక్ష్మి, శ్రీలత తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments