*దీక్ష విజయ దివస్* *శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మసీద్ బండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన మారబోయిన రవి యాదవ్*
నేటి సత్యం శేర్లింగంపల్లి డిసెంబర్ 9
*తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాకారానికి తొలి అడుగు పడ్డ చారిత్రక విజయ్ దివస్.*
ఈ రోజు దీక్ష విజయ దివస్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మసీద్ బండా నందు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్ష విజయ దివస్ను ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకలు *మారబోయిన రవి యాదవ్ గారు*, సీనియర్ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు…కార్యక్రమం ప్రారంభంలో అంబేడ్కర్ విగ్రహానికి పుష్పార్చన చేయబడింది. అనంతరం తెలంగాణ తండ్రి *శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారి* చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగినది. దీక్ష విజయాన్ని ప్రతీకాత్మకంగా తెలిపే గులాబీ బెలూన్లు ఆకాశంలో విడుదల చేయబడి ఉత్సవాన్ని మరింత వైభవంగా మార్చినట్లు చెప్పుకోవచ్చు.
ఈ సందర్భంగా మారబోయిన రవి యాదవ్ గారు మాట్లాడుతూ…
*తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారు స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజు అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారానికి తొలి అడుగు పడ్డ చారిత్రక రోజు అని అన్నారు. డిసెంబర్ 9 ‘దీక్ష విజయ్ దివస్’ తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం చేపట్టిన నిరాహార దీక్షలు ప్రజల్లో ఉద్యమ జ్వాలను రగిలించాయని, కే.సీ.ఆర్ గారి ధైర్యం, అచంచల నిబద్ధత రాష్ట్ర సాధనకు మూలశక్తిగా నిలిచిందని గుర్తుచేశారు. ఉద్యమకారుల త్యాగాలు, విద్యార్థుల ప్రాణత్యాగాలు, ప్రజల మద్దతు—ఇవి తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన శక్తి అని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిబద్ధతతో ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు.*
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె.ఎన్. రాములు, వెంకట్ రెడ్డి, స్వామినాథ్, గొద్దం శ్రీనివాస్, గంగాధర్ గౌడ్, నవీన్ గౌడ్, వాకిటి శంకర్, రాజు గౌడ్, శ్రీకాంత్ యాదవ్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, కె. రాజు చారి, సోమనాథ్, శ్రీశైలం యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, అనిల్ యాదవ్, బల్రాజ్, జంగయ్య, శశికలా, లక్ష్మీదేవి, అనిత, కె. రాజేష్వరి మరియు అనేక పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.