కాసింపేటలో భక్తిశ్రద్ధలతో వసంత పంచమి:
విద్యా దేవతగా స్వయంభూ మనసా దేవి వసంత పంచమి వేడుకలు.
పదివేల పెన్ను లతో అమ్మవార్లకు అలంకరణ….
గన్నేరువరం, నేటి సత్యం జనవరి 23 : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో వెలిసిన స్వయంభు మనసా దేవి ఆలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని సరస్వతి దేవిగా పదివేల పెన్నులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి అలంకరణకు ఉపయోగించిన పెన్నులను మరుసటి రోజు దర్శనానికి వచ్చే భక్తులకు 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అందజేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.