Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogసమాచార రక్షణ హక్కు చట్టం సాధన...

సమాచార రక్షణ హక్కు చట్టం సాధన…

సమాచార రక్షణ హక్కు చట్టం సాధన- కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ‘దేశరాజు శివ సాయి’ నియామకం.

గన్నేరువరం, నేటి సత్యం, ఫిబ్రవరి 3 :

కరీంనగర్ జిల్లా: సమాచార రక్షణ హక్కు చట్టం సాధన కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా దేశరాజు శివ సాయి ను నియమిస్తున్నట్లు ఫౌండర్ నేషనల్ చైర్మన్ డాక్టర్. చంటి ముదిరాజ్ తెలిపారు.

ఈ సందర్భంగా దేశరాజు శివ సాయి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అనేది భారత పౌరులకు ప్రభుత్వ సమాచారాన్ని పొందే హక్కును కల్పించే చట్టం 2005లో ఆమోదించబడినదని.. ప్రభుత్వ పారదర్శకతను జవాబు దారితనాన్ని మరియు అవినీతిని అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.

సమాచారం యొక్క ముఖ్య లక్షణాలు పౌరులకు సమాచారం తెలిస్తే వారు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించగలుగుతారు. వారి హక్కులను కాపాడుకోగలుగుతారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ పనితీరులో పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు సమాచారం అందుబాటులోకి వస్తుంది అని వారు చెప్పుకొచ్చారు,

ఈకార్యక్రమంలో భాగంగా జిల్లా సమాచార హక్కు చట్టం సాధన మెంబర్స్ సుర స్రవంతి,మల్లం వెంకటేశం, ఎన్. శ్రీధర్ లు నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ దేశరాజు శివ సాయి కి శుభాకాంక్షలు తెలియజేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments