నేటి సత్యం హైదరాబాద్ జూన్ 15
రాష్ట్రంలో తగ్గిపోతున్న బొగ్గు నిల్వలు
దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అతి తక్కువ బొగ్గు నిల్వలు
ఉత్పత్తి వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టడం మానేసిన సింగరేణి సంస్థ
అవసరమైన దాంట్లో కేవలం 24 శాతమే అందుబాటులో ఉన్నట్లు తన నివేదికలో వెల్లడించిన కేంద్ర విద్యుత్ మండలి(సీఈసీ)
ఈ నెల 13వ తేదీ నాటికి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉండాల్సిన బొగ్గు నిల్వలు 25.54 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 24%(6.09)లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నట్లు సీఈసీ నివేదిక వెల్లడి
గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా, గత ఏడాది సింగరేణి ఉత్పత్తి 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని తెలిపిన నివేదిక
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో రోజుకి 43,700 టన్నుల బొగ్గు అవసరం ఉండగా, ఈ నెల 13వ తేదీన కేవలం 13,500 టన్నులే వచ్చిందని, దీంతో కేవలం 21% ఉత్పత్తి మాత్రమే జరిగిందని నివేదిక వెల్లడి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 11.32 లక్షల టన్నుల కనీస బొగ్గు నిల్వలు ఉండాల్సిన అవసరం ఉండగా కేవలం 18%(2,03,760) మాత్రమే ఉండడం గమనార్హం
దేశంలో అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాల్సి ఉండగా, 58 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో ఉత్పత్తి వివరాలను సింగరేణి వెబ్‌సైట్‌లో పెట్టొద్దని ఆదేశించిన ఓ అధికారి
తెలంగాణ జెన్కో కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయినందున బొగ్గు సరఫరా పెంచాలని సింగరేణి ఆదేశించిన సీఈసీ