‘స్పష్టత’ ప్రశ్నకు “సస్పెన్షన్” జవాబు
నేటి సత్యం..పార్లమెంట్ సమావేశాలు…
ప్రతిపక్షానికి, అధికార వర్గానికి మధ్య ప్రశ్నలు, జవాబులు దేశవ్యాప్త సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించుకునే వేదిక… కానీ బడ్జెట్ సమావేశాలు అగ్ని గుండం తలపించింది. అధికార యంత్రాంగం దగ్గర స్పష్టత ఉన్నా సమాధానం ఇవ్వాల్చినవసరం ఉంది. అయితే లోక్‌సభలో రాహుల్ గాంధీ… మోదీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం (Trade Deal) వెనుక ట్రంప్ ఒత్తిడి ఉందంటూ రాహుల్ చేసిన ఆరోపణలు సభలో పెను సంచలనమే. సభను అడ్డుకున్నారనే మంత్రంతో యంత్రాంగం తీసుకున్న చర్యకు అర్థమేంటి..? సభను అడ్డుకున్నారనే కారణంతో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
రాహుల్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటి లాగే కొన్ని విమర్శలు చేసిండ్రు. “ప్రధాని మోదీ తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం వల్లే ఈవాణిజ్య ఒప్పందంపై మోదీ సంతకాలు చేశారని, దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి అమెరికాకు దేశాన్ని అమ్మేశారు” అని రాహుల్ ధ్వజమెత్తారు. అమెరికాలో అదానీపై కేసు నమోదైందని, వాళ్ల అసలు టార్గెట్ అదానీ కాదని, ప్రధాని మోదీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమేనని రాహుల్ అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఇంకా బయటకు రాని విషయాలు ఉన్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను విస్మరించి మోసం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ ప్రసంగం సమయంలో చోటుచేసుకున్న గందరగోళం, నిరసనల నేపథ్యంలో స్పీకర్ కఠిన చర్యలు తీసుకున్నారు.
సెక్రటరీ జనరల్ బెంచ్‌పైకి ఎక్కి నినాదాలు చేయడం, సభా మర్యాదలను ఉల్లంఘించడంతో 8 మంది ఎంపీలపై సమావేశాలు పూర్తి అయ్యే వరకు వేటు పడింది.
రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రసంగం సమయంలో.. రాహుల్ గాంధీ డోక్లాం వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకురావడంతో స్పీకర్ అడ్డుకున్నారు. సభను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. దాంతో విపక్ష నేత రాహుల్‌కు మాట్లాడే సమయం ఇవ్వడం లేదని విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంపైకి పేపర్లు విసిరారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. సభా నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించగా వేటుకు కారణమైంది.
గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన (అమెరికా-భారత్) వాణిజ్య ఒప్పందంపై నరేంద్ర మోదీ నిన్న రాత్రి సంతకం చేశారు.. ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉంది. వేల కోట్లతో క్రియేట్ చేసిన ప్రధాని ప్రతిష్ట దెబ్బతినొచ్చు’ అని అన్నారు. అమెరికాలో గౌతమ్ అదానీపై కేసుతో మోదీ ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. ‘అమెరికాలో అదానీపై ఒక కేసు ఉంది.. అది నిజానికి మోదీజీపై కేసు…. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అమెరికా ఇంకా విడుదల చేయని మరిన్ని రహస్యాలు ఉన్నాయి… దాని వల్ల కూడా ఒత్తిడి ఉంది. ఒత్తిడికి ఈ రెండూ కారణం.. ప్రధాని మోదీ భయపడిపోతున్నారు.. దేశం దీన్ని అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందం కుదరడంతో భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని, అమెరికా వస్తువులపై సున్నా సుంకాలకు భారత్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు.అయితే, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వ్యవసాయ ఉత్పత్తులకు గేట్లు తెరవడం, సుంకాలను “సున్నా”కు తగ్గించాలని కోరడం, రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయడం వంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలతో సహా అనేక కీలక అంశాలపై ఆ పార్టీ పలు సందేహాలు లేవనెత్తింది. అంతేకాదు, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణ మాదిరిగానే ఈ వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటన చేశారని విమర్శించింది. రాహుల్ గాంధీ భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడిందనే వ్యాఖ్యలు తాను స్వయంగా చేయలేదని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని భారత సైన్య మాజీ చీఫ్ మనోజ్ నరవణే తన పుస్తకంలో రాసారని తెలిపారు. ఆ పుస్తకం వెలుగులోకి వస్తే అసలు నిజాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో కేంద్ర ప్రభుత్వం ప్రచురణను అడ్డుకుంటోందని ఆరోపించారు.
లోక్ సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలను సభలో లేవనెత్తేందుకు తాను ప్రయత్నించినా మాట్లాడనివ్వడం లేదని చెప్పారు. సరిహద్దు పరిస్థితులు, సైన్యానికి ఎదురైన ఇబ్బందుల గురించి ప్రజలకు నిజాలు తెలియకుండానే ప్రభుత్వం దాచిపెడుతోందని విమర్శించారు.
నరవణే రాసిన పుస్తకం బయటకు వస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సైన్యంపై పడిన ప్రభావం బయటపడుతుందని, అందుకే కేంద్రం ఆందోళన చెందుతోందని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రత అంశాలపై పారదర్శకత అవసరమని, ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తరువాత అమెరికా – భారత్ వాణిజ్య ఒప్పందం పై పీయూష్ గోయల్ ఏకపక్ష సమాధానం మాత్రమే ఇచ్చారు కానీ స్పష్టమైన సమాధానం లేదు.
పార్లమెంటు సమావేశాల్లో ఎప్పటిలాగానే సభా సంప్రదాయాల పేరుతో…. ప్రశ్నలు వేసిన వారిపై సస్పెండ్ చేయడమే జవాబులుగా కొనసాగుతోంది. సభాపతి తీసుకున్న చర్యలు ప్రశ్నించే గొంతును అణచివేసే ధోరణికి దగ్గరగానే ఉంటాయి. కానీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన రూపాన్ని దాచిపెట్టడం వర్గ వివక్ష కిందనే చూడాలి.. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ…. ప్రతిపక్ష ప్రశ్నలను ప్రజలకు దూరం చేయడానికి అనువైన యంత్రం సస్పెన్షన్ వేటు…. పవిత్రమైన పార్లమెంటులో ప్రతిపక్షం అడ్డుకుంటుందని, అధికార పక్షం హేళన చేస్తూఉందంటూ… ఒకరు అధికారంలోకి రావడం కోసం… మరొకరు అధికారాన్ని కాపాడుకోవడం కోసం స్పష్టతను సూసైడ్ చేస్తున్నారు…..
పార్లమెంటు సాక్షిగా ప్రజలకు అధికారపక్షం, ప్రతిపక్షం రెండు ప్రజలను మభ్యపెట్టి అధికారం కోసం వాడుకునే ధోరణి నిజమైన పార్లమెంటు సమావేశాలుగా చిత్రీకరిస్తున్నారు….
పార్లమెంట్ నుంచే వచ్చే సమాధానంపై ప్రజలు ఆసక్తిగా ఉంటారు. ఇన్నేళ్లు అధికారాన్ని ఇచ్చి సామాన్యుల సైతం… ఆర్థిక బలోపేతం, భద్రత, జీవన విధానంపై మార్గాల కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. జాతికి ఇచ్చిన నవధాన్యాల బడ్జెట్…. ప్రజలకు ఏమాత్రం సరితూగదు. వీటికి గల కారణాలను కూడా ప్రజలకు తెలియని ఇవ్వకపోవడం నిజమైన సస్పెన్షన్ వేటు. అటువైపు పక్షం… ఇటువైపు పక్షానికి అధికారాలను ఇచ్చుకుంటూ ప్రత్యామ్నాయాలను దూరం చేసుకుంటూ ఉండడం కంటే… ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటులోకి తీసుకెళ్లే పరిస్థితి తెస్తే కొంతమేర ఊరటను పొందగలుగుతాం…