Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఆంధ్రప్రదేశ్లో లడ్డు సమస్య ఒకటే ఉందా సిపిఐ

ఆంధ్రప్రదేశ్లో లడ్డు సమస్య ఒకటే ఉందా సిపిఐ

రాష్ట్రంలో ప్రజలకు. అభివృద్ధికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నా పాలక ప్రతిపక్షాలు తిరుపతి లడ్డును కేంద్రంగా చేసుకొని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

నేటి సత్యం కడప ఫిబ్రవరి 9

. రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ మాఫియాపై ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన చేపట్టడం జరుగుతుందని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సోమవారం హోచిమిన్ భవన్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్రతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వివాదాస్పదంగా శాంతిభద్రతలు అడుగంటిన స్థాయికి వెళ్లాయన్నారు. కూటమి ప్రభుత్వంతో పాటు వైసీపీ కూడా ప్రజా సమస్యలపై చర్చల ద్వారా పోరాటాల ద్వారా అభివృద్ధి వైపు బాటలు వేయకుండా వారు చేస్తున్న నీచ రాజకీయాలను చూసి రాష్ట్ర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కార్మిక వర్గం కనీస వేతనాల కోసం రైతులు నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఒకపక్క కరువు తాండవిస్తూ నానాటికీ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా పాలకులకు కనువిప్పు కలిగించడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమిచ్చారు. ఏం సాధించాము, ఎన్ని నిధులున్నాయనే వాటిపై పాలక ప్రభుత్వం పూర్తిగా విస్మరించి లడ్డు రూపంలో డ్రైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం విభజన హక్కుల గురించి గానీ రాష్ట్ర వాటాపైన ఏమాత్రం స్పందించలేదని అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఎగుమతి సుంకాలపై 18శాతం పన్ను కడుతూ దిగుమతి సుంకాలపై జీరో శాతం ట్యాక్స్ లేకుండా భారతదేశాన్ని డంపింగ్ యార్డులా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ విషయంలో తప్పిదాలు జరిగి ఉంటే సిట్, సీబీఐ పూర్తి విచారణ చేసిన తరువాత రాజ్యాంగబద్ధంగా శిక్షలు విధించాలని దర్యాప్తులు పూర్తికాక ముందే దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. రాజ్యాంగబద్ధంగా పదవులలో ఉన్న వారు ఎవరైనా అక్రమ పద్ధతులలో దూషణలు చేయకూడదని అలాంటి వారిని రాజ్యాంగానికి లోబడి చట్టప్రకారం శిక్షించాలే తప్ప దాడులు చేయకూడదన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా యధేచ్ఛగా కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని ఘాటుగా విమర్శించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనరిక్ మందులు స్వల్ప ధరకే అందిస్తున్నామని మాటలు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదన్నారు. దేశంలోని కార్పొరేట్ మెడికల్ కంపెనీలు నాణ్యతా లోపంతో మందులు తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని దీనికి వత్తాసుగా మెడికల్ ఏజెన్సీలు, ల్యాబొరేటరీలలో అన్యాయాలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యంచూస్తోందన్నారు. 60వేల మంది ఫార్మసిస్టులు అవసరం ఉంటే 30వేల మందితోనే కొనసాగిస్తూ భోగన్ సర్టిఫికెట్లతో మందుల గురించి తెలియని వారితో కూడా మందులు అమ్మిస్తున్నట్లు సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతోందని వీరిని అరికట్టడంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఉద్యమానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఉద్ది మద్దిలేటి, పి బాలు, వెంకట్ రాముడు పాల్గొన్నారు.

అభినందనలతో .,గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి కడప

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments