Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogనాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ భారీ రోడ్ షో

నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ భారీ రోడ్ షో

మున్సిపల్ ఎన్నికల ముగింపు ప్రచారంలో కాంగ్రెస్ భారీ రోడ్ షో

నేటి సత్యం నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 9

నాగర్‌కర్నూల్‌లో అపూర్వ స్పందన

నాగర్‌కర్నూల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ముగింపు ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించబడింది.

ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ గారు పాల్గొన్నారు.

పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ భారీ ర్యాలీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ,

నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

గత రెండేళ్లలో దాదాపు రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

ఎండబెట్ల వద్ద హై లెవల్ బ్రిడ్జికి రూ.10 కోట్లు

పట్టణంలో సీసీ రోడ్లకు రూ.20 కోట్లు

నాగర్‌కర్నూల్ బస్టాండ్ అభివృద్ధికి రూ.12 కోట్లు

యంగ్ ఇండియా స్కూల్‌కు రూ.200 కోట్లు

పట్టణంలో ఎమ్మేల్యే గారి కృషితో 9 కోట్ల రూపాయలతో మంజూరు అయిన నూతన ప్రభుత్వ కళాశాల భవన

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో రూ.45 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు,పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments