నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబాలపై రెడ్లు జరిపిన అమానుష దాడిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది l
నేటి సత్యం హైదరాబాద్ ఫిబ్రవరి 22
కుల అహంకారంతో దాడులు జరిపి పాప మరణానికి కారకులైన శ్రీనివాస్ రెడ్డి ముఠాపై కఠినమైన చర్యలు తీసుకోవాలి l
ఆదిపత్యకుల భావజాలం కలిగిన పార్టీలకు పదేపదే అధికారం ఇస్తే దళితులపై జరిగే అమానుష ఘటనలకు నిలువెత్తు సాక్ష్యంమే ఈ దాడి l
కమ్యూనిస్టు సిపిఐ రాజ్యం ఏర్పడితేనే దళిత బిడ్డలకు రక్షణ ఉంటుంది l
నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో కులం అహంకార ధోరణిగల రెడ్లు రజక కుటుంబానికి చెందిన ఒక కుటుంబం పై దాడి చేసారు ఆ దాడి కారణంగా రెండు నెలల పాప మరణించింది కుల అహంకారంతో రెడ్లు రజకులపై జరిపిన ఈ అమానుష దాడిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని. సిపిఐ శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి. రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ పత్రికా . ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ ఘటనలో పాలుపంచుకున్న అందరిని రిమాండ్ చేయాలని కుల అహంకారంతో దాడి చేసి పాప మరణానికి కారణమైన శ్రీనివాసరెడ్డి ముఠాపై మర్డర్ కేసు నమోదు చేసి కఠినమైన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాధితులకు అండగా ఉండాల్సిన పోలీస్ యంత్రాంగం రెడ్లకు అనుకూలంగా ఉండటం దుర్మార్గమని మండిపడ్డారు రాజకీయ ఒత్తిళ్లకు తలవంచి ఘటనకు ఘటనకు కారణమైన నిందితులను ఏ ఒక్కరిని కూడా తప్పించే ప్రయత్నం చేయడానికి వీలులేదని కేసును నీరు గారిచే పని చేస్తే దళిత సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఆదిపత్యకుల భావజాలం కలిగిన పార్టీలకు పదేపదే అధికారం ఇస్తే బహుజనులపై జరిగే అమానుష దాడులకు నిలువెత్తు సాక్ష్యం ఈ నాగర్ కర్నూల్ లో రజకులపై జరిగిన దాడి అని తెలిపారు ఇప్పటికైనా దళిత సమాజం మేల్కొనాలని ఈ ఘటనలు రజకులతో ఆగేవి కాదని మిగిలిన బహుజన కులాల దాకా తప్పకుండా వస్తుందని అన్నారు దళిత బిడ్డల రక్షణ కోసం కమ్యూనిస్టు రాజ్యం ఏర్పాటు కోసం ఐక్యంగా ఉద్యమించాలని యావత్తు దళిత సమాజానికి పిలుపునిచ్చారు టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు