తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్‌గా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ
గన్నేరువరం, నేటి సత్యం, మార్చి 12:
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన మాదాపూర్ కాంగ్రెస్ శ్రేణులు
మానకొండూరు శాసనసభ్యులు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మాదాపూర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు మాదాపూర్ నుండి భారీ సంఖ్యలో తరలివెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు, సత్యనారాయణ ని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచే కవ్వంపల్లి కి ఈ పదవి దక్కడం హర్షణీయమని పేర్కొన్నారు.
వారి నాయకత్వంలో రాష్ట్రంలో దళితుల అభివృద్ధి, సామాజిక న్యాయం మరింత బలోపేతం అవుతాయని, కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.