నేటి సత్యం హైదరాబాద్ జూలై 29
హైడ్రా మీద మరో ఇద్దరు సీనియర్ జడ్జిల ఆగ్రహం
ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని ఆదేశించిన హైకోర్టు
భూమి ఓనర్లకు నోటీసులివ్వకుండా మీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం
హయత్‌నగర్ మండలం సాహెబ్ నగర్
కాలనీలోని ప్లాట్ నం.10లో హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును సవాల్ చేస్తూ ఝాన్సీ, మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీ విజయ్ సేన్ రెడ్డి
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా
మరో కేసులో నోటీసు ఇవ్వకుండా, వివరణకు అవకాశం కల్పించకుండా కూల్చివేతలకు దిగడంపై హైడ్రాతో పాటు తహసీల్దార్ వ్యవహారాన్ని తప్పుబట్టిన జస్టిస్ ఎన్పీ శ్రవణ్ కుమార్
కొండాపూర్‌లోని 350 చదరపు గజాల ప్లాటుకు చెందిన కాంపౌండ్ గోడ, వాచ్‌మన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పెమ్మసాని సుధారాణి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎన్పీ శ్రవణ్ కుమార్ విచారణ
కొండాపూర్‌లోని సర్వే నంబర్ 60లో ప్రైవేట్ స్థలంలోని కాంపౌండ్ గోడను కూల్చివేయాలంటూ హైడ్రాకు ఏ ఆధారాలతో లేఖ రాశారని శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను నిలదీసిన హైకోర్టు
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని హైడ్రాను ప్రశ్నించి.. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రాకు సమాచారం ఎందుకు ఇచ్చారో ఈ నెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా