అయ్యో……..మనుషులు మనుషుల్ని కాలుస్తున్నారు.
నేలంతా రక్తంతో నిండిపోతోంది
టెహ్రాన్ గోడలు కూలుతున్నాయి
కీవ్ మట్టి ఇంకా ఎరుపెక్కుతోంది
సూడాన్ బిడ్డలు ఆకలితో ఏడుస్తున్నారు.
ఒకడు డ్రోన్ బాంబు వేస్తాడు
మరొకడు మిస్సైల్ పేల్చి నవ్వుతాడు
అమెరికా-ఇజ్రాయెల్ చేతులు కలిపి
ఇరాన్ గుండెల్ని చీల్చేస్తున్నాయి.
“స్వేచ్ఛ” అంటూ, “రక్షణ” అంటూ
ప్రపంచం మళ్లీ యుద్ధ గీతాలు పాడుతోంది
కానీ రక్తం మాత్రమే సత్యం..
మయన్మార్లో సైన్యం చంపుతోంది
హైతీలో గ్యాంగులు రాజ్యం చేస్తోంది
యెమెన్లో ఆకాశంలో బాంబులతో నిండిపోయింది
సొమాలియాలో బాల్యం చనిపోతోంది
ఇంకా ఎన్ని బాంబులు?
ఎన్ని శవాలు?
ఎన్ని ఏడుపులు?
మనుషులు మనుషుల్ని కాలుస్తున్నారు
అవసరమేంట్రా?
మనిషి గుండెలు చీల్చడానికా?
పిల్లల కళ్లలో భయం నింపడానికా?
గుడిసెలు కూలుతున్నాయి
మేడలు నిలబడి చూస్తున్నాయి
అయినా ఎవరూ ఆగట్లేదు
ఈ రక్తపు నది ఎప్పుడు ఆగుతుంది?
ఎప్పుడు మనుషులు మనుషుల్ని చూసి
కన్నీళ్లు పెట్టుకుంటారు?
ఇంకా ఎన్ని యుద్ధాలు?
ఇంకా ఎన్ని శవాలు?
ఇంకా ఎన్ని స్మశానాలు?
మనుషుల్ని మనుషులుగా చూసేది ఎప్పుడు?
ఈ రాజకీయ క్రీడలలో………
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
విషయ సేకరణ :-
కా,, తోట జీవన్న, జిల్లా కార్యదర్శి,
సిపిఐ (ML) RED STAR పార్వతీపురం మన్యం జిల్లా,,,,,,,,,,,,