Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogపెంచిన ఎల్పిజి ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉండాలి

పెంచిన ఎల్పిజి ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉండాలి

*పెంచిన ఎల్పిజి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి* – *ప్రజలపై భారం మోపవద్దు* *పాలమాకుల జంగయ్య*. *సిపిఐ జాతీయ సమితి సభ్యులు*

నేటి సత్యం శేర్లింగంపల్లి మార్చి 28

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు జీవన భారం మోయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ఎల్పిజి గ్యాస్ ధరలను తగ్గించాలి. ప్రజలకు అందుబాటులో గ్యాస్ సరఫరా నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించి, ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించాలి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కాకుండా సామాన్య ప్రజల పక్షాన నిలబడాలి. ధరల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది.

అందువల్ల ప్రభుత్వం తక్షణమే:

– ఎల్పిజి గ్యాస్ ధరలను తగ్గించాలి

– గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించాలి

– పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలి

లేకపోతే ప్రజా ఉద్యమాలు తీవ్రరూపం దాల్చే అవకాశముందని హెచ్చరిస్తున్నాము.. ఈరోజు సిపిఐ కార్యాలయం శేరిలింగంపల్లి నియోజకవర్గ సమితి. కౌన్సిల్ కార్యవర్గ సమావేశం. కే.వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు. టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. కే చందు యాదవ్ సిపిఐ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి. కున.సుధాకర్ ఎస్ కొండలయ్య జెట్టి శ్రీనివాస్. ఎం వెంకటేష్. బి నారాయణ. తుపాకుల రాములు. కే శివకుమార్. ధర్మ తేజ నితీష్. అశోక్ కే కాశీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments