యువత కమ్యూనిస్టు పార్టీలోకి కావడం – దేశానికి గర్వకారణం! కామ్రేడ్ పాలమాకుల జంగయ్య సిపిఐ జాతీయ సమితి సభ్యులు
నేటి సత్యం. శేరిలింగంపల్లి మార్చి 28
ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోతూ, ధరల భారం సామాన్య ప్రజల మెడను నులిమేస్తున్న వేళ, పాలక వర్గాల ప్రజావ్యతిరేక విధానాలు దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో యువత మౌనంగా ఉండకుండా, పోరాట మార్గాన్ని ఎంచుకుని కమ్యూనిస్టు పార్టీలో చేరడం దేశానికి గర్వకారణం.
కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ శ్రమజీవుల పక్షాన నిలబడి, కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోంది. దోపిడీ, అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా నిలిచే ఏకైక ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు సిద్ధాంతమే.
నేటి యువత ఉద్యోగాల కోసం తలవంచే పరిస్థితి నుంచి బయటపడాలి. వారి శక్తిని, ప్రతిభను సమాజ మార్పు కోసం వినియోగించాలి. కమ్యూనిస్టు ఉద్యమం యువతకు ఒక దిశ, ఒక లక్ష్యం, ఒక పోరాట పథం చూపుతుంది.
దేశాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి అప్పగించే పాలకుల విధానాలకు చెక్ పెట్టాలంటే, యువత పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీలో చేరాలి. సమానత్వ సమాజం నిర్మాణం కోసం యువత ముందుకు రావడం అత్యవసరం.
CPI పిలుపు: యువత ముందుకు రండి – పోరాటాలలో భాగస్వాములు కండి!
తుపాకుల కిరణ్ కుమార్ ను.. రక్తపు సాయి లను
ఈరోజు శేర్లింగంపల్లి నియోజక వర్గ పార్టీలోకి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య గారు సభ్యత్వం నుంచి స్వాగతించారు.