నేటి సత్యం హైదరాబాద్ ఏప్రిల్ 1 ప్రజల కోసం పనిచే స్తున్న సిపిఐ కి విరివిగా విరాళాలు ఇవ్వండి:
కూనంనేని సాంబశివ రావు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో సామూహిక నిధి సేకరణ హిమాయత్ నగర్ లో కూనంనేని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం సమాజంలో దోపిడీ,పీడనలేని వ్యవస్థ అయినా సోషలిజం లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలను నిర్మిస్తున్నది.
అనుబంధ సంఘాల ద్వారా వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను నడుపుతున్నది.
నేడు సమాజంలో పాలకవర్గాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాల్లో పాల్గొనాలని ఆకాంక్ష అనేకమందిలో ఉన్నప్పటికిని తమ వృత్తిరీత్యా వ్యక్తిగత పనుల అవసరాల రిత్యా సమయాన్ని కేటాయించలేకపోవచ్చు కానీ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్నటువంటి మహత్తరమైన రాజకీయ పోరాటంలో ఆర్థికంగా సహకరించి ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఏప్రిల్ 1 నుండి 10 వ తారీకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రజల వద్దకు సిపిఐ పార్టీ కార్యకర్తలు నాయకులు వస్తున్న సందర్భంగా అన్ని రకాలుగా చేయూతను అందించి పటిష్టమైన పార్టీ నిర్మాణం కోసం ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నిధి సేకరణకు ప్రజలనుంచి విశేష స్పందన.
ఈటీ నరసింహ
సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి.
వెలకట్టలేని త్యాగాలతో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ అనేక నిర్బంధాలను దాటుకుంటూ ప్రజల కేంద్రంగా ఉద్యమాన్ని నిర్వహించింది.
దేశ స్వాతంత్ర పోరాటం నుంచి మొదలుకొని మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజా రాశులను ఏకం చేసి పాలకవర్గాల మెడలు పంచింది.
భూ సంస్కరణ చట్టం , ఈఎస్ఐ ,పీఎఫ్ ,సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వయోజనులకు ఓటు హక్కు కోసం అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించింది.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మతవిద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ధి పొందుతున్నది.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం సిపిఐ పార్టీ ఉద్యమ ప్రజాక్షేత్రంలో ముందున్నది. ఈ పార్టీకి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ ఉన్నది. ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ప్రజల దగ్గరికి వెళ్లి ఆర్థికంగా సహకరించమని కోరినప్పుడు వారి నుంచి విశేషమైన స్పందన వస్తున్నది.
బుధవారం 71,252 రూపాయలు వచ్చాయి.
భవిష్యత్తులో ప్రజల మద్దతుతో మరిన్ని త్యాగాలతో కూడిన పోరాటాలకు సిద్ధపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ ఛాయా దేవి, అంజయ్య నాయక్, సభ్యులు సీనియర్ నాయకులు ప్రేమ్ పావని, జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, AIYF రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర,జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.నరసింహ, చంద్ర మోహన్ గౌడ్,నేర్లకంటి శ్రీకాంత్,కాంపల్లి శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు ఆరుట్ల రాజ్ కుమార్, సక్రి బాయి, బాలకృష్ణ ,శ్రీమాన్, నరసింహ,సైఫ్, రాజమౌళి,చైతన్య, గ్యార నరేష్, పి.వెంకటయ్య,బొడ్డుపల్లి కిషన్, సత్య ప్రసాద్,కళ్యాణ్,జ్యోతి, అనిల్,సునీత,అంజుం,వంశీ,సుశాంత్, ఉదయ్,ఫహీం,భాను, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.