నేటి సత్యం ఏప్రిల్ మైక్రో ఇరిగేషన్లో ఏపీ నంబర్ 1: సీఎం చంద్రబాబు
అనంతపురం: బిందు, తుంపర్ల సేద్యం (మైక్రో ఇరిగేషన్)లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది 70 టీఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు తీసుకొచ్చినట్లు చెప్పారు. గంగా నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తిచేస్తామని తెలిపారు.