విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని లేక
నేటి సత్యం హైదరాబాద్ ఏప్రిల్ 10
శ్రీయుత ఎనుముల రేవంత్ రెడ్డి గారు,
గౌరవ ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్.
నమస్కారములు.
విషయము : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సమ్మెలో ఉన్న ఆర్టిజన్ కార్మికులపై ఎస్మా, డిస్మిస్, మెమో లాంటి బెదిరింపు ధోరణితో ఇబ్బందులకు గురిచేయకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు వారితో చర్చలు జరిపి పరిష్కరించుట గురించి.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు రంగంలో 18 వేల మందికి పైగా ఆర్టిజన్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ జన్`కో, ట్రాన్స్`కో, ఎన్.పి.డి.సి.ఎల్, ఎస్.పి.డి.సి.ఎల్ మరియు ఇతర విభాగాల్లో ఉన్నారు. వీరందరూ గత మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. చట్టబద్ధంగా సమ్మె నోటీసు ఇచ్చి కాలపరిమితి ప్రకారం అధికారులు స్పందించక పోవటంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె చేస్తున్న కార్మికులను ఎస్మా, డిస్మిస్, మెమో లాంటి బెదిరింపు ధోరణితో ఇబ్బందులకు గురిచేయకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్చల ద్వారా పరిష్కరించాలి. గత ప్రభుత్వం ఆర్టిజన్ అనే పేరుతో కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేసే విధంగా చట్టం చేసి గత పది సంవత్సరాలుగా వేతనాలు ఇవ్వడంలో పదోన్నతులను కల్పించడంలో విద్యార్హతను బట్టి సమూచిత స్థానం ఇవ్వకుండా ఎదుగు బొదుగు లేకుండా ఉన్న స్థానంలోనే ఉంచుతున్నారని, కష్టం చేస్తున్నవారికి వేతనాలు, పదోన్నతులు లేకుండా చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో కార్మికుల సమ్మెతో ఉత్పత్తి పై ప్రభావం పడుతున్నది.
కావున ఈ పరిస్థితిలలో పట్టింపులకు వెళ్ళకుండా ఆర్డిజెన్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్‌ను పరిష్కరించి, సమ్మెను విరమింప చేయాల్సిందిగా తమరిని విజ్ఞప్తి చేస్తున్నాను.
ధన్యవాదములుతో…
అభివందనములతో,
కూనంనేని సాంబశివరావు, ఎంఎల్ఎ
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.
దీని ప్రతులు
1) శ్రీయుత మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు,
2) శ్రీయుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జన్`కో
3) శ్రీయుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ట్రాన్స్`కో
4) శ్రీయుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్.పి.డి.సి.ఎల్,
5) శ్రీయుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎస్.పి.డి.సి.ఎల్