నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 22 *ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి*
*ఆర్టీసీ కార్మికుల – సమస్యలు పరిష్కరించాలి!*
నేటి సత్యం శేర్లింగంపల్లి ఏప్రిల్ 22
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శేర్లింగంపల్లి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపో దగ్గర ధర్నా చేస్తున్న కార్మికులకు మద్దతు. తెలిపిన సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ. సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ
ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకలైన ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం సమ్మె బాట పట్టడం దురదృష్టకరం. ప్రభుత్వం వారి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా, ఆలస్యం చేయడం ప్రజా రవాణా వ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని ఇప్పటికి చేసుకోలేదు వెంటనే చేసుకోవాలి
ప్రైవేటు బస్సులను రద్దుచేసి ఆర్టీసీ సంస్థనే నడపాలి ప్రవేట్ వ్యవస్థను రద్దు చేయాలి
ఆర్టీసీ కార్మికులు చాలా కాలంగా వేతనాల పెంపు, బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, సరైన సేవా నియమాలు వంటి ప్రధాన సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్లను పట్టించుకోకుండా కాలయాపన చేయడం అన్యాయం. కార్మికుల కష్టం మీద నడిచే ఆర్టీసీని బలహీనపరచడం ప్రజలకే నష్టం.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. సమ్మె కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. వెంటనే చర్చలు జరిపి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలి.
కార్మికుల హక్కుల కోసం జరిగే ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమవుతుంది.. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రజానాట్యమండలి అధ్యక్షులు కే. సుధాకర్. సిపిఎం జిల్లా నాయకులు సిపిఎం జిల్లా నాయకులు మండల ఇన్చార్జి కే కృష్ణ. తదితరులు పాల్గొన్నారు