నేటి సత్యం హైదరాబాద్ మే 6 తెలంగాణలో ఇంటర్ బోర్డు రద్దు?
ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు ప్రణాళికలు
అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యే 25 రోజుల ముందు అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేయాలని కాలేజ్ యాజమాన్యాలకు ఆదేశాలు
ఇప్పటికిప్పుడు అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశాలు ఇస్తే ఎలా అంటూ విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన
గతంలో ఆకునూరి మురళి చేసిన ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన స్కూల్ టీచర్స్ మరియు ఉన్నత విద్యా శాఖ అధికారులు
ఇటీవల మరోసారి ఇంటర్ బోర్డు రద్దు అంటూ మీడియా ద్వారా లీకులు ఇస్తున్న విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి
అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన కొద్ది రోజులకే అడ్మిషన్లు ఆపివేయాలని కాలేజ్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఇప్పటికిప్పుడు ఇంటర్ బోర్డు విలీనం అంటే విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళనలో కాలేజీల యాజమాన్యాలు, తల్లిదండ్రులు
బోర్డు విలీనానికి చాలా సమయం పడుతుందని, ఆ సమయంలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని పేరెంట్స్ ఆవేదన
ఇలాంటి ప్రక్రియ అమలు చేయాలంటే కనీసం ఏడాది ముందైనా నోటిఫికేషన్ ఇచ్చి, సరైన సమయం ఇవ్వకపోతే తమ పిల్లల భవిష్యత్తు ఆగం అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఇప్పటికే సమ్మర్ కోచింగ్ పేరిట కొందరు విద్యార్థులు ఇంటర్ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ తీసుకుంటున్నారని, ఇప్పుడు బోర్డు విలీనం చేస్తే వారు పోటీ పరీక్షలు రాసే సామార్థ్యాన్ని కోల్పోతారని ఇంటర్ జేఏసీ అసహనం
ప్రభుత్వం చేస్తున్నవి దౌర్భాగ్యమైన చర్యలని, ఈ ఆలోచన ఇచ్చిన వారు ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి
గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా ఇలాంటి సలహాలు ఇచ్చి అతని ఓటమిలో ఆకునూరి మురళి ప్రధాన పాత్ర పోషించాడని, ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అలాంటి సలహాలే ఇస్తున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చలు