Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకొండెక్కిన చికెన్ ధరలు..?

కొండెక్కిన చికెన్ ధరలు..?

నేటి  సత్యం కొలపూర్ మే 10

కోడి మాంసం ధరలు

మస్తు పిరం అయ్యాయి…

(యస్.పి. మల్లికార్జున సాగర్).

మాంసం ప్రియులకు సామాన్యులకు అందుబాటులో ఉండే బాయిలర్ కోడి మాంసం ధరలు కొల్లాపూర్ లో మస్తు పీరం అయ్యాయి.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో నిన్న మొన్నటి వరకు కిలో బాయిలర్ కోడి మాంసం 280 రూపాయలు గా ఉండేది.

పొట్టేలు మాంసం కిలో ధర వెయ్యి రూపాయలుగా, నాటుకోడి మాంసం కిలో 800 రూపాయల నుంచి 900 రూపాయలుగా ఉండేవి.

కాగా ఆదివారము ఉదయం నుండి 280 నుండి 350 రూపాయలకు బాయిలర్ కోడి కేజీ మాంసం ధర ఒక్కసారిగా పెరిగిపోయినది.

దీంతో సామాన్యులకు అందుబాటులో ఉండే బాయిలర్ కోడి మాంసం ధరలు పెరగడం తో మాంసం ముక్క లేనిదే నోటిలోకి ముద్ద దిగని మాంసం ప్రియులు సామాన్యులు ఎండా కాలం లో కోడి మాంసం ధరలు తగ్గాల్సింది పోయి ఇలా ఏక్ దమ్ము న 350 రూపాయలకు పెరిగి పోవడం తో కోడి మాంసం తినాలనుకున్న మాంసం ప్రియులు డజన్ 70 రూపాయలకు కోడిగుడ్లు కొనుక్కొని తింటూ జిహ్వ చాపల్యం ను తీర్చుకుంటూ ఆనందపడిపోతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments