Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogబండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి టి.రామకృష్ణ

బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి టి.రామకృష్ణ

నేటి సత్యం హైదరాబాద్ మార్చి 14

ఫోక్సో నిందితుడు బండి భగీరథును వెంటనే అరెస్ట్ చేయాలి టి. రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు.

*మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి*

17 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి బండి భగీరథ పై ఫోక్ షో కేసు బుక్కై. ఇప్పటికీ రోజులు గడుస్తున్నాయి కానీ అరెస్టు చేయలేదు ఎందుకు..? సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న. టి రామకృష్ణ..

చిన్నారుల రక్షణ కోసం తీసుకువచ్చిన ఫోక్సో చట్టం కింద కేసు నమోదైన బండి భగీరథును వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) డిమాండ్ చేస్తోంది. చిన్నారుల భద్రతను భంగం కలిగించే ఘటనలు సమాజానికి మచ్చతెచ్చేవని, ఇలాంటి ఘటనల్లో నిందితులను రాజకీయ ప్రభావాలు, అధికార అండలతో కాపాడే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సిపిఐ తీవ్రంగా హెచ్చరించింది.

ప్రస్తుతం మహిళలు, బాలికలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని సిపిఐ విమర్శించింది. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులను రక్షించే ధోరణి కొనసాగితే ప్రజల్లో చట్టంపై నమ్మకం దెబ్బతింటుందని పేర్కొంది.

ఫోక్సో కేసు వంటి అత్యంత తీవ్రమైన నేరాల్లో పోలీసులు ఆలస్యం చేయకుండా వెంటనే అరెస్ట్ చేసి వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని సిపిఐ డిమాండ్ చేసింది. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ విషయంలో ప్రభుత్వాలు మాటల్లో కాదు, చేతల్లో చూపించాలని కోరింది.

ఈ ఘటనపై ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పోరాడాలని.సిపిఐ పిలుపునిచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments