Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogచమురు ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు.

చమురు ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు.

నేటి సత్యం హైదరాబాద్ మే 15

చమురు ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ కే నారాయణ

అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల యుద్ధోన్మాద విధానాలు ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిరపరుస్తున్నాయి. యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ముడి చమురు ధరలు పెరుగుతాయి. దాని భారాన్ని చివరకు సామాన్య ప్రజలే భరించాల్సి వస్తోంది.

భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై సెస్సులు, పన్నులు, ఇతర అదనపు వసూళ్ల ద్వారా ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. దాని ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడుతోంది. రైల్వేలు, విమాన ప్రయాణాలు, సరుకు రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.

రైల్వేలు, విమానయాన సంస్థలు అమలు చేస్తున్న “డైనమిక్ ప్రైసింగ్” విధానం ప్రజలను దోచుకునే మరో రూపంగా మారింది. డిమాండ్ ఎక్కువగా ఉంటే టికెట్ ధరలను అనియంత్రితంగా పెంచడం ఈ విధానం లక్ష్యం. ఫలితంగా మధ్యతరగతి, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ – తిరుపతి రైల్వే టికెట్ ధర ఈరోజు రూ.8,000 వరకు పెరగడం దారుణం. ఇది ప్రజా సేవ పేరుతో జరుగుతున్న బహిరంగ దోపిడీ తప్ప మరొకటి కాదు.

ప్రజలకు సేవ చేయాల్సిన రైల్వేలు లాభాల కోసం నడిచే సంస్థలుగా మారకూడదు. పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులను తగ్గించి, డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఐ తీవ్రంగా డిమాండ్ చేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments