Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకేంద్రo కోటకే ధాన్యం కొనుగోలు పరిమితం చేయడం రైతులపై దాడే టి రామకృష్ణ

కేంద్రo కోటకే ధాన్యం కొనుగోలు పరిమితం చేయడం రైతులపై దాడే టి రామకృష్ణ

నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 19

కేంద్ర కోటకే ధాన్యం కొనుగోలు పరిమితం చేయడం రైతులపై దాడే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోంది

*టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన కోటాకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడం రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం చేయడమేనని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ మండిపడ్డారు. రైతులు ఏడాది పొడవునా కష్టపడి పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రశ్నించకుండా రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం అత్యంత దురదృష్టకరమన్నారు. కేంద్ర కోటా పేరుతో ధాన్యం కొనుగోలు పరిమితం చేస్తే లక్షలాది మంది రైతులు తీవ్ర నష్టాలకు గురవుతారని హెచ్చరించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తేమ శాతం, గన్నీ సంచుల కొరత, రవాణా సమస్యలతో రైతులు అవస్థలు పడుతున్న సమయంలో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోకుండా చేతులు దులుపుకోవడం రైతాంగాన్ని మోసం చేయడమేనని విమర్శించారు.

రాష్ట్రంలో పండిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రైతు సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకుని, రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సిపిఐ డిమాండ్ చేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments