Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఉపాధి కూలీలపై వారపు మామూళ్ల భారం

ఉపాధి కూలీలపై వారపు మామూళ్ల భారం

నేటి సత్యం నిర్మల్ జూన్ 27

ఉపాధి కూలీలపై ‘వారపు మామూళ్ల’ భారం?

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో ఉపాధిహామీ కూలీల నుంచి వారానికోసారి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం చెల్లిస్తేనే పూర్తి కూలీ ఖాతాలో జమ అవుతుందని కొందరు చెప్తున్నట్లు కూలీలు చెప్తున్నారు. దీనిపై అభ్యం తరం వ్యక్తంచేసిన వారి హాజరును తగ్గిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లపై ఒత్తిడితెచ్చి ఈవసూళ్లు జరుగుతున్నాయన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశమైంది.

పని కంటే ఫొటోలకే ప్రాధాన్యమా?

కొన్నిచోట్ల పని చేయకపోయినా ఉదయం, సాయంత్రం ఫొటోలు దిగితే సరిపోతుందని కూలీలు చెబుతున్నారు. ప్రతిగా వారానికి కొంత మొత్తం ఇవ్వాలని షరతు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి కూలీ వస్తుందనే ఆశతో కొందరు కూలీలు కూడా ఇందుకు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. చెరువులు, కాలువలు, అటవీ ప్రాంతాల్లో జరిగే పనులను పర్యవేక్షించడం కష్టమవడం ఈ పరిస్థితికి కారణమవు తోందని అంటున్నారు. దీంతో పథకం అమలు పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమాలకు పాల్పడిన వారిని తొలగించాం..

-ప్రమీల, ఏపీవో

కిందిస్థాయి సిబ్బంది కొంతమంది అక్రమాలకు పాల్పడింది వావస్తవమే. వారి ఇప్పటికే తొలగించాం. హాజరు తప్పుగా నమోదు అయినా, కూలి అకౌంట్‌లో పడకున్నా నా దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కస్తాను. అలాగే అక్రమాలకు పాల్పడిన వారి గురించి తగిన ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments