నేటి సత్యం జూన్ 28 ముదిగొండ పోలీస్ స్టేషన్ ఖమ్మం
ఆంధ్రప్రదేశ్ నుండి ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు..
*రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తనిఖీ చేసిన రూరల్ ఏసీపీ*
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశించారు.
ఆదివారం ముదిగొండ మండలం రాష్ట్ర సరిహద్దులోని మల్కాపురం క్రాస్ రోడ్డు గల చెక్ పోస్ట్ ను ముదిగొండ సిఐ మురళి తో కలసి రూరల్ ఏసీపీ తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దు పోలీస్ స్టేషన్ల పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలాని, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టుల ద్వారా పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అక్రమంగా తరలిస్తున్న లారీలను సీజ్ చేయాలని ఆదేశించారు. రవాణాకు అవకాశం ఉన్న అన్ని మార్గాలలో చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారులంతా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఖమ్మం రూరల్ పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులలో పోలీస్ సిబ్బంది మూడు షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తాయని పేర్కొన్నారు.