నేటి సత్యం అబ్దుల్లాపూర్మెట్ జూలై 5
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
80వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రం సిపిఐ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్ర చారి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాది రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విసునూరి దొర రామచంద్రారెడ్డి ఆగడాల వ్యతిరేకించినందు న దొర గుండాల కాల్పుల్లో వీర మరణం పొందినారని అన్నారు నాటి తొలి అమరత్వం తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిందని ఎర్రజెండాలతో బరిసెలతో దొరలను ఎదిరించిన వీరులు ఎందరో అమరులయ్యారని తద్వారా నిజాం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనమైందని అన్నారు ఈ పోరాటంలో కమ్యూనిస్టులు పాత్ర మరువలేనిదని నేడు వచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఓట్లు తొలగిస్తున్నారని ఇందులో బిజెపి కుట్ర దాగి ఉందని నిష్పక్షపాతంగా అధికారులు వ్యవహరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉండే విధంగా కృషి చేయాలని లేని ఎడల మరో పోరాటాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుడిసె వాసులకు న్యాయం చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6 తారీఖున ఇందిరా పార్క్ లో జరిగే వామపక్షాల మహా ధర్నా లొ వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల పార్టీ సహాయ కార్యదర్శి కేతరాజు నరసింహ మెట్టు శాఖ కార్యదర్శి వర్త్య రమేష్ మహిళా సమైక్య నాయకులు చందన అబ్దుల్లా పూర్ మెట్టు గ్రామ పంచాయతీ13 వ వార్డు సభ్యురాలు కేతరాజు మంజుల బిక్షపతి నాగేశ్వరరావు సుల్తాన్ నరసయ్య ఎనుగోటి లక్ష్మి ప్రియా పేరాల లక్ష్మి వాసిరెడ్డి లక్ష్మి లలిత వైశాలి మానెమ్మ నాగేష్ తదితరులు పాల్గొన్నారు