Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఅర్హులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి..!

అర్హులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి..!

నేటి సత్యం మహబూబాబాద్ జులై17

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందించాలి

టి డబ్ల్యూ జే ఐ జే యు జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం( టి డబ్ల్యూ జే ఐ జే యు) ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టి డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం హక్కుల పరిరక్షణ కోసం టి డబ్ల్యూ జే ఐ జే యు నిరంతరం కృషి చేస్తుందన్నారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు సంఘాన్ని మరింత బలోపేతం చేయాలంటే ప్రతి జర్నలిస్టు సభ్యత్వం తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తమ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందజేసింది అన్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఆరో కోరగా ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి సంఘ నాయకులు వివిధ పత్రికలు ఎలక్ట్రాన్ మీడియాకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments