Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరోగులకు అందుతున్న సేవలపై చర్చ

రోగులకు అందుతున్న సేవలపై చర్చ

నేటి సత్యం కామారెడ్డి ఆగస్టు 3

మంత్రి దామోదర రాజనర్సింహ తో పలు అంశాలను చర్చించిన పోచారం

హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, శిశు ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, వ్యాధుల నివారణ చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు

బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న, పూర్తి కావస్తున్న ఆసుపత్రులకు అవసరమగు మరికొంత నిధుల మంజూరు గురించి మరియు ప్రజలకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రుల్లో ఔషధాల లభ్యత, మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది కొరత వంటి అంశాలపై మంత్రి తో పోచారం చర్చించారు

బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిపాదనలు

చందూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం నిధుల కొరత కారణంగా పూర్తి కానందున దీని పూర్తి కోసం అదనంగా రూ. 40 లక్షలు మంజూరు చేయాలి.

వర్ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ సౌకర్యం లేదు, డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేసి, కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందించాలి.

వర్ని ఆసుపత్రికి అవసరమైన వైద్య, పారామెడికల్ సిబ్బంది మరియు పరికరాలు మంజూరు చేయాలి.

కోటగిరి 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావస్తుంది కావున సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలు మంజూరు చేయాలని కోరారు

బాన్సువాడ (100 పడకలు) ఏరియా ఆసుపత్రి నిర్మాణం తుది దశలో ఉంది, ఈ ఆసుపత్రికి ఆధునిక పరికరాలు,ICU, ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్ మంజూరు చేయాలనీ తెలిపారు

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రి (MCH) , ఏరియా ఆసుపత్రి (AH) లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో నియమించి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments