ఈసీఐలో ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్రమైన అవకతవకలు జరగడానికి కారణమైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
సిపిఐ జాతీయ సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య డిమాండ్
ఈసీఐలో ముగ్గురు సభ్యులు కలిగిన కమిటీలో ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తూ బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా.ఓట్ల చోరీకి అవకాశం కల్పించిన జ్ఞానేశ్ కుమారు తక్షణమే రాజీనామా చేయాలి సిపిఐ జాతీయ సమితి సభ్యులు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్
సోమవారం నాడు శంషాబాద్ మండల కేంద్రంలో సిపిఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు అధ్యక్షతన జరిగింది ముఖ్యఅతిథిగా జంగయ్య పాల్గొని మాట్లాడారు ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఓట్ల చివరికి పాల్పడే అవకాశం కల్పించిన ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే పార్లమెంటులో చర్చించి సస్పెండ్ చేయాలని జంగయ్య డిమాండ్ చేశారు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడానికి అధికారులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల ఎన్నికల దరఖాస్తులను తిరస్కరించే కుట్రలు చేస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యే ఎంపీలను ప్రలోభ పెట్టి బిజెపిలోకి చేరే విధంగా ఈ డి. సి బి ఐ ఎన్నికల అధికారులను వాడుతున్నదని ఆయన విమర్శించారు
ఎన్నికల హామీలను అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో వ్యతిరేకతను పోగొట్టడానికి మతాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని రాజకీయాలు చేయడం సిగ్గుమాలిన చర్యని ఆయన విమర్శించారు
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే ప్రధాన ఎన్నికల అధికారులు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఓట్లను తొలగించే కుట్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమని అలాంటి వ్యక్తులను తక్షణమే సస్పెండ్ చేయకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని జంగయ్య అన్నారు
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి సిపిఐ కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి ముత్యాల యాదిరెడ్డి టి రామకృష్ణ కామెడీ శేఖర్ రెడ్డి పబ్బతి లక్ష్మణ్ పల్నాటి యాదయ్య ఆరు యాదగిరి నీలమ్మ పి శివకుమార్.ఎం ఏ రియాజ్ దత్తు నాయక్ కే చందు యాదవ్ మల్లేష్ పాలమాకుల శ్రీశైలం కే శ్రీనివాస్ ఆనంద్ గౌడ్ విజయ్ ఆనంద్ గౌడ్ గిలక రాజు నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు