నేటి సత్యం/ కల్వకోల్ /సెప్టెంబరు 29

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత తమ హక్కుల సాధనకై ఉద్యమించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ ఎండి ఫయాజ్ పిలుపు..
సమాజంలో జరుగుతున్న అనేక అసమాన తలపై తమ హక్కుల సాధనకై యువత విప్లవ యువకిశోరం షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాల్లోకి రావాలని సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ పిలుపునిచ్చారు భగత్ సింగ్ 119 వ జయంతి ఉత్సవాలు పెద్దకొత్తపల్లి మండలంలోని కల్వకుల్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ఆయన జయంతి సందర్భంగా కేకులు కట్ చేసి అందరికీ పంచి పెట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ భారతదేశ బానిస సంకెళ్లు పగలగొట్టడానికి ఉరికంబానికి ఊయలోగి మృత్యుని ముద్దాడిన అమరుడు భరతమాత వీర పుత్రుడు భగత్ సింగ్ ని ఈ దేశ యువత ఐకాన్ గా తీసుకోవాలని నేడు సమాజంలో మనిషికి మనిషికి మధ్య పెరిగిపోతున్న అంతరాలను నామరూపాలు లేకుండా చేయాలి అంటే సమ సమాజం ఒక్కటే మార్గమని అలా భగత్ సింగ్ కలలుగన్న సమసమాజానికై సమాజంలోని ప్రతి వర్గాల ప్రజలకు సమస్యలు లేని ఒక కొత్త సమాచారం నిర్మాణానికి యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు నేడు యువత భగత్ సింగ్ లాంటి యువకిశోరాలను త్యాగనిరద్దులను కాదని సినిమా యాక్టర్లను క్రికెటర్లను హీరోలుగా భావించే సంస్కృతి రావడం చాలా బాధాకరమన్నారు ముఖానికి రంగు వేసుకుని తెరపై నటించే వాళ్ళు కాదు హీరోలు దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన భగత్ సింగ్ ఏ నిజమైన హీరో అని ఆయన కొనియాడారు భగత్ సింగ్ జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు భగత్ సింగ్ గురించి తెలుసుకోవాలని భగత్ సింగ్ జీవిత చరిత్రను ఆయన పోరాటాల జీవితాన్ని చదవాలి ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు ఎన్నో ఆదర్శాలు చైతన్యంతో నిండిన కల్వకొల గ్రామంలో భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు ఇలా ఘనంగా జరుపుకోవడం హర్షించదగ్గ విషయం అని ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ప్రతి పోరాటంలో ముందు ఉండాలి యువత అని నేడు దేశంలో ప్రభుత్వాలన్నీ కూడా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని తుంగల తొక్కలనేటువంటి ఒక భయానకమైన క్రీడాకో అలవాటు పడ్డాయని రాజ్యాంగ పరిరక్షణ కోసం భగత్ సింగ్ స్ఫూర్తితో యువత పోరాటాలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు దేశం కోసం నునుగు మీసాలు యవ్వనంలోనే ప్రాణాలు ఇచ్చిన భగత్‌సింగ్ కాకుండా మనుషుల మధ్య విభజన గీసిన వాళ్లకు భారత ప్రభుత్వాలు భారతరత్న ఇస్తున్నాయని ఇప్పటికైనా షహీద్ సర్దార్ భగత్ సింగ్ కు భారతరత్న ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు భారత పార్లమెంటు భవనంలో భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఫయాజ్ విజ్ఞప్తి చేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్వకోలు మాజీ సర్పంచ్ మతోన్మాద శక్తులన్నీ నేడు భగత్‌సింగ్ మావాడు అంటూ ఈరోజు కీర్తించే కార్యక్రమాలు చేస్తున్నాయని నిజానికి భగత్ సింగ్‌కు ఆయా వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదని భగత్‌సింగ్ కేవలం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎర్రజెండను ప్రేమించాడని తరతరాలుగా మా పార్టీ ప్రజా సంఘాలు భగత్ సింగ్ జయంతి వర్ధన్తులు ఆయన సిద్ధాంతాలను నిర్వహిస్తూ ఆయన ఆశయాలను మోసుకెళ్తున్నామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహకార దర్శి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా గ్రామ ఉపసర్పంచ్ కుర్మయ్య సిపిఐ గ్రామ కార్యదర్శి సంగం కృష్ణ సిపిఐ సీనియర్ నాయకులు చింతపల్లి కురుమయ్య ప్రకాష్ పూజారి శేఖర్ వెంకటయ్య ధర్మరాజు శివ తిరుపతయ్య మిద్దె రామకృష్ణ సురేష్ బాలస్వామి అంజనేయులు భగత్ సింగ్ యూత్ సభ్యులు భగత్ సింగ్ హమాలీ యూనియన్ సభ్యులు వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు