Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

జర్నలిస్టులకు వృతి నైపుణ్య శిక్షణ…

కామారెడ్డి /నేటి సత్యం/ సెప్టెంబర్ 29

బాన్సువాడలో జర్నలిస్టులకు వృత్తి నైపుణ్య శిక్షణ

ఆధునిక మీడియా విధానాలు, సాంకేతికతపై అవగాహన

జిల్లాలోని జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత పెంపొందించడంతో పాటు ఆధునిక మీడియా విధానాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. బాన్సువాడలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.

కార్యక్రమానికి బాన్సువాడ శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిజం రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వార్తల సేకరణ, వాస్తవ నిర్ధారణ, వార్తల ప్రసారం తదితర అంశాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు.

మీడియా రంగం రోజురోజుకూ వేగంగా మారుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వార్తలను వేగంగా అందించడంతో పాటు వాటి వాస్తవికతను నిర్ధారించుకోవడం, బాధ్యతాయుతంగా వార్తలను ప్రజలకు చేరవేయడం ఎంతో ముఖ్యమని వివరించారు.

జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, మారుతున్న మీడియా పరిస్థితులకు అనుగుణంగా పనిచేసేలా వారిని తీర్చిదిద్దడమే శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments