
నేటి సత్యం/ హయత్ నగర్ / అక్టోబర్ 2
ఓట్ల గల్లంతుకు వ్యతిరేకంగా గాంధీ జయంతి నాడు అర్ధనగ్న ప్రదర్శన!
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సీపీఐ హయత్ నగర్ మండల సమితీ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లోని గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన చేపట్టడం జరిగింది.
‘ ఎస్ ఐ ఆర్’ ప్రక్రియ పేరుతో అక్రమంగా ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
సీపీఐ హయత్‌నగర్ మండల కన్వీనర్ అంబల రాములు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “మహాత్మా మన్నించు.. ఇది భారతీయుల ఆత్మఘోష” అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఓటర్ల హక్కులను కాలరాస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి గారు, బొంగు అరుణ్ కుమార్ గౌడ్, చెంది సుమతి, శాగంటి వీరన్న, రమేష్, శేఖర్, ఉపేందర్, కృష్ణ, అంకన్న, సౌజన్య, జూనోతల భాను ప్రకాష్ తదితర ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.